రాజోలు మండలంలోని శివకోటిలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు శివకోటి నుంచి రాజోలు వెళ్లే రోడ్డు బురదగా మారింది. గత నాలుగేళ్లుగా ఈ రోడ్డుకు కనీసం తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడంతో ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరారు. విద్యార్థులు సైతం పాఠశాలలకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని వారు ఆదివారం చెప్పారు.