నియోజవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చేపడుతున్నామని రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ అన్నారు. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఓఎన్జీసీ నిధులతో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు.