ప్రసిద్ధి చెందిన రాజోలు మండలం కడలి గ్రామంలోని కపోతేశ్వర స్వామి దర్శనానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజామున నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. షష్టి వేడుకల్లో భాగంగా తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకొని కడలి గ్రామం కోలాహలంగా మారింది. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు.