రాజోలు: హక్కుల పరిరక్షణ కోసం మాలలు త్యాగాలకు సిద్ధం కావాలి

57చూసినవారు
హక్కుల పరిరక్షణ కోసం మాలలు త్యాగాలకు సిద్ధం కావాలని మాలల న్యాయపోరాట సమితి నాలుగు మండలాల జేఏసీ ముఖ్య సలహాదారు మురళీకృష్ణ పిలుపునిచ్చారు. రాజోలు మండలం చింతలపల్లిలో ఎస్సీ వర్గీకరణతో మాలలు ఏ విధంగా నష్టపోతున్నారు అన్న అంశంపై రాజోలు మండల జేఏసీ కన్వీనర్ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం దళిత నేత సత్యనారాయణ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్