కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని రాజోలు టీడీపీ పరిశీలకుడు రామ్మోహన్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మలికిపురం మండలం గుడిమెల్లంక టీడీపీ గ్రామ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించగా, సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా వెంకటరమణ, ఉపాధ్యక్షునిగా త్రిమూర్తులు ఎన్నికయ్యారు.