ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించాలి: డీఎం

76చూసినవారు
ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించాలి: డీఎం
డ్రైవర్లు, కండక్టర్లు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించాలని రాజోలు ఆర్టీసీ డిపో మేనేజర్ భాస్కరరావు కోరారు. రాజోలు ఆర్టీసీ డిపోలో మంగళవారం జరిగిన సమావేశంలో డిపో పరిధిలో అత్యధిక ఈపీకే సాధించిన కండక్టర్లు, కేయంపీఎల్ సాధించిన డ్రైవర్లకు డీఎం ప్రశంసా పత్రాలు, క్యాష్ అవార్డులను అందజేశారు. ఉద్యోగులను అభినందించారు. ప్రయాణికుల పట్ల మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్