సఖినేటిపల్లి: నరసింహస్వామిని దర్శించుకున్న నటుడు శ్రీకాంత్

51చూసినవారు
సఖినేటిపల్లి: నరసింహస్వామిని దర్శించుకున్న నటుడు శ్రీకాంత్
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు తొలుత ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్