గ్రామాలలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. సఖినేటిపల్లి మండలం శృంగవరప్పాడు గ్రామ సమస్యలపై అధికారులతో మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్బంగా గ్రామంలో వేయవలసిన రోడ్ల ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.