సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. బహుళ ద్వాదశి సందర్భంగా వేద పండితులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ విజయ సారథి అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.