ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. సఖినేటిపల్లి మండలం మోరి, కేశవదాసుపాలెంలలో జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాజశేఖర్ ఆదివారం పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. గతంలో మునిపెన్నడూ లేని విధంగా సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.