స్టాప్ డయేరియా కార్యక్రమంతో భాగంగా వ్యాధి నిర్మూలనకు అవగాహన కల్పించడానికి ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డా. జయగాయత్రి తెలిపారు. ఈ నెల 16 నుంచి జులై నెలాఖరు వరకు నిర్వహించే ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ప్రోగ్రాంపై శుక్రవారం సఖినేటిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.