కె.గంగవరం రామాలయంలో శ్రీరామనవమి ముగింపు వేడుకలు

62చూసినవారు
కె.గంగవరం రామాలయంలో శ్రీరామనవమి ముగింపు వేడుకలు
కె. గంగవరం రామాలయంలో శుక్రవారం సీతారాములకు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖుడు నేమాని ప్రసాద్ బాబు మాట్లాడుతూ శ్రీరామనవమి మహోత్సవాలు ముగింపు సందర్భంగా శుక్రవారం సీతారాములకు విశేష పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్