మలికిపురంలోని ఒక కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రపంచ రక్త దాన దినోత్సవం పురస్కరించుకొని రాజోలు పట్టణ కేంద్రం రాజోలులో శనివారం ర్యాలీ నిర్వహించారు. రక్తదానంతో ఎటువంటి హాని జరగదని, మేలు జరుగుతుందని వైద్యులు, విద్యార్థులు స్థానికులకు అవగాహన కల్పించారు. రక్తదానం చేయండి మళ్లీ జీవించండి అని నినాదాలు చేశారు.