కందికుప్పలో హల్ చల్ చేసిన ప్రమాదకర రక్త పింజరి పాము

50చూసినవారు
కాట్రేనికోన మండలం పరిధిలోని కందికుప్పలో ఆదివారం ప్రమాదకర రక్తపింజరి పాము హల్ చల్ చేసింది. వాసు అనే వ్యక్తికి చెందిన ఇంటి ఆవరణలోని బడ్డీలో రక్త పింజరి పాము ప్రవేశించడంతో ఇంట్లోని వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే భీమనపల్లికి చెందిన స్నేక్ కేచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా.. అక్కడకు చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా ఒక డబ్బాలో బంధించారు.

సంబంధిత పోస్ట్