అల్లవరం: గల్లంతైన యువకుని కోసం గాలింపు

52చూసినవారు
అల్లవరం మండలం బోడసకుర్రు వైనతేయ వారధిపై నుంచి దూకి గోదావరి నదిలో గల్లంతైన యువకుని కోసం అల్లవరం పోలీసులు మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడు మలికిపురం మండలం రామరాజులంకకు చెందిన జవ్వాది కృపా కిరణ్ (25)గా గుర్తించారు. కిరణ్ స్కూటీని బ్రిడ్జిపై నిలిపి గోదావరిలో దూకిన సంగతి విధితమే. చెన్నైలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కిరణ్ మూడు రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్