అంగర విద్యుత్ సబ్ స్టేషన్లో రెండు కొత్త బ్రేకర్లను ఏర్పాటు చేయడం వల్ల బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. రత్నాలరావు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని కపిలేశ్వరపురం, అంగర, టేకి, మాచరమట్టలు, శ్రీరామపురం, వెదురు మూడి, పడమరఖండ్రిక, నల్లూరు, కాలేరు, సుభద్రాపురం, వల్లూరు, నేలటూరు, గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం గం 12 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు