శ్రీశ్రీశ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయి ప్రభు సేవా సంస్థ అధినేత చింతల వాసు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. కోటనందూరు మండలం తిమ్మరాజుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, పెన్ లు , మహిళలకు చీరలు, 1000 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అలియన్ క్లబ్ అధ్యక్షులు కేఎస్ఎన్, సభ్యులు దాసరి నూకయ్య శెట్టి , కంకిపాటి రాము జిఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.