విద్యార్థికి ఆర్థిక సహాయం

56చూసినవారు
విద్యార్థికి ఆర్థిక సహాయం
తుని మండలం ఎస్ అన్నవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సీరం లిఖిత్ వీరేంద్ర 539 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించాడు. లిఖిత్ కు చదువుపై ఉన్న శ్రద్ధను గుర్తించి దాడిశెట్టి నరసయ్య చారిటబుల్ తరపున దాడిశెట్టి శ్రీనివాస్ ఇంటర్ విద్యకు కావలసిన రూ. 30000 ఆర్దిక సహాయం అందించారు. తునిలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న తండ్రి సీరం గోవిందు దాడిశెట్టి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్