పాఠశాల నూతన యాజమాన్య కమిటీ ఏర్పాటు

74చూసినవారు
పాఠశాల నూతన యాజమాన్య కమిటీ ఏర్పాటు
కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం నూతన స్కూల్ యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఏర్పాటైంది. చైర్మన్ గా అడిగర్ల నాగమణి, వైస్ చైర్మన్ గా సలాది ప్రసాద్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ నాగమణి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం తమ వంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్