తునిలో ఎండలో పెరుగుతున్న నేపథ్యంలో పక్షుల దాహాన్ని తీర్చేందుకు రోటరీ క్లబ్ నడుంబిగించింది. ప్రతినివాసం వద్ద ప్రతి వ్యాపార సముదాయం వద్ద మట్టిపాత్రలు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి బుధవారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పక్షుల కోసం ఈ మట్టి పాత్రలో నీళ్లువేసి ఖాళీ ప్రాంతంలో పెట్టినట్లయితే వాటి దాహాన్ని తీర్చున్నవారు అవుతారని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలియజేశారు.