కళాశాలకు నీటి ట్యాంకు బహుకరణ

64చూసినవారు
కళాశాలకు నీటి ట్యాంకు బహుకరణ
తుని పట్టణంలోని బ్యాంక్ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు రూ. 30వేలు విలువైన 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న మంచినీటి ట్యాంకులు రోటరీ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు వర్మ, కిషోర్ రెడ్డి శనివారం అందజేశారు. బోరు నీటిని ఈ ట్యాంకులో నింపి శుద్ధి చేసి కళాశాల యజమాన్యం ఆరో ప్లాంట్ కు అనుసంధానం చేస్తుందని వారు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, రోటరీ క్లబ్ ప్రతినిధులు ఈశ్వర్ గణేష్, పొన్నాడ శ్రీనివాస్, ఎన్ వీర్రాజు, ఎం వివేకానంద్, డి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్