ఆషాడమాసం సందర్భంగా తలుపులమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత. తుని మండలంలో కొలువై ఉన్న శ్రీ తలుపులమ్మ లోవను గురువారం రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. హోం మంత్రికి ఆలయ మర్యాదలతో , పూర్ణ కుంభ స్వాగతం పలికారు. తలుపులమ్మ తల్లి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం సిబ్బంది హోమంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.