తుని పట్టణంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుక కార్యక్రమం బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పార్క్ సెంటర్లో గల జ్యోతిరావు పూలే విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ వెంకటరావు తహసీల్దార్ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అతిథులు పిలుపునిచ్చారు. కూటమి ముఖ్యనేత మల్లగణేష్ కు బిసి ఐక్యవేదిక ఘన సత్కారం చేసింది.