కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామానికి చెందిన అవుగడ్డి హర్షిత ఇంటర్ ఎంపీసీలో 988 మార్కులు సాధించింది. విద్యార్థిని తండ్రి శ్రీనివాసరావు విద్యుత్ శాఖలో లైన్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. హర్షితకి 988 మార్కులు రావడంతో ఎంఈఓ శ్రీనివాస్, తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు. భవిష్యత్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.