ఆషాడ మాస ఉత్సవాల్లో భాగంగా తుని మండలం తలుపులమ్మ లోవలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆదివారం లక్ష పుష్పార్చనలతో పూజా కార్యక్రమాలు ఆలయ వేద పండితులు నిర్వహించినట్లు ఈవో విశ్వనాధరాజు తెలిపారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని పూలదండలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో భక్తులు బార్లు తీరారు.