ఆలమూరు మండలం మడికి వద్ద ఉన్న అంతర్ రాష్ట్ర కూరగాయ మార్కెట్లో ఈనెల 20 నుంచి కూరగాయ అమ్మకాలు, కొనుగోళ్ల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు కూరగాయల మార్కెట్ కమిటీ కార్యదర్శి చెల్లు బోయిన సింహాచలం మంగళవారం తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్లు, అమ్మకాలు ఉదయం నుంచి ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 2 గంటల తరువాత మాత్రమే మళ్లీ మార్కెట్ ప్రారంభమవుతుందని ఈ విషయాన్ని రైతులు, వర్తకులు గమనించాలని కోరారు.