కంచి కామకోటి పీఠానికి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం ఆధ్వర్యంలో వైస్ ఛాన్ లర్ సమక్షంలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల ఎంపిక జరుగుతుందని కొండవీటి రామలింగేశ్వర శర్మ తెలియజేశారు. ఈనెల 23వ తేదీ చావలి వారి వీధి గవరపేట శివాలయంలో స్పాట్ అడ్మిషన్ జరుగుతుందని విద్యార్థులు నియోగించుకోవాలని కోరారు. ఈరంకి నూకేశ్వర శర్మ, తేజో మూర్తుల సర్వశాస్త్రి, కొడుకుల నాగభూషణరావు పలువురు పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.