తుని రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన

81చూసినవారు
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని తుని అగ్నిమాపక శాఖాధికారి రాముడు అన్నారు. అగ్నిమాపక భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం తుని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ ను నిర్వహించారు. రైళ్లలో ప్రయాణించే సమయంలో మండే స్వభావం కలిగిన వస్తువులను తమ వెంట తీసుకెళ్లకూడదని ప్రజలకు ఆయన సూచించారు. రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్