తుని మండలం డి పోలవరం కే ఓ మల్లవరం విద్యుత్ ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని ఏపీఈపిడిఎస్ఎల్ జగ్గంపేట ఈ ఈ కె. రత్నాలరావు ఓ ప్రకటనలో తెలిపారు. కొలిమేరు, ఎన్ సురవరం, ఎం ఎస్ వి నగరం, అటకవానిపాలెం, సిహెచ్ అగ్రహారం, కోటనందూరు, కాకరపల్లి, అల్లిపూడి, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.