కాకినాడ జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితుల్లో ప్రభావంతో కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తులు, నివారణ సంస్థ మంగళవారం నాడు హెచ్చరికలు జారీ చేసింది. తుని, పెద్దాపురం, కాకినాడ రూరల్, ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులు, ప్రయాణికులు, ప్రజలు, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చరవాణి హెచ్చరికల ద్వారా రాష్ట్ర విపత్తులు నివారణ సంస్థ ప్రజలకు తెలిపింది.