కోటనందూరులో శనవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. గాజువాకకు చెందిన శివ బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా తాండవ కాలువలో కాలుజారి నీటిలో పడిపోయాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.