తుని ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిరసనలు

54చూసినవారు
తుని ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిరసనలు
తిరుపతి రుయా ఆసుపత్రిలో నైట్ డ్యూటీ చేస్తున్న స్టాఫ్ నర్స్ యశోదపై పేషంట్ దాడికి నిరసనగా తుని ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది నిరసన తెలియజేశారు. అసుపత్రి బయటకు వచ్చి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలుకు కూడా భద్రత లేని సన్నివేశాలు ఎదురవుతుంటే ఎలా ఉద్యోగం చేయాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్నారు.

సంబంధిత పోస్ట్