క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా పండగలకు గుండాట, పేకాట, కోడిపందాలు నిర్వహించేందుకు అనుమతి లేదని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. సోమవారం విలేకరులతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో జూదం ఆడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో సొంత ఇల్లు కలిగిన వాళ్ల ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.