తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడును ఉభయగోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఏవి నగరంలో శుక్రవారం కలిశారు. ఈసందర్భంగా రాబోవు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి పలు విషయాలు ఇరువురు చర్చించారు. అనంతరం ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్యను కలిసి ప్రచారం నిర్వహించారు. కూటమి తరుపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న రాజశేఖరంను గెలిపించాలని కోరారు.