వైసీపీ కార్యకర్తలు, నాయకులకు పనులు చేయొద్దంటూ యనమల రామకృష్ణుడు అనడంతో ఆయనపై ఉన్న గౌరవం పోయిందని కాకినాడజిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. మీకు దమ్ముంటే వైసీపీ కార్యకర్తలకు పథకాలు ఆపి చూడండని, వీలైతే ప్రతి స్కూల్, హాస్పిటల్ దగ్గర వైసీపీకి ఓట్లు వేసిన వాళ్లకు ఏపనీ చేయమని బోర్డులు కూడా పెట్టండని, ఎన్నికల సమయంలో కేవలం టీడీపీ వాళ్ల ఇంటికే వెళ్లి ఓట్లు అడిగారా అంటూ శనివారం తుని సభలో నిలదీశారు.