తునిలో సీతారాంపురం మునిసిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు శనివారం తమ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిమిత్తం స్టీల్ ప్లేట్లు బహూకరించారు. ఇటీవల పూర్వ విద్యార్థులు యేన్నేటి రాజు, దంతలూరి వెంకట శివరామకృష్ణ రాజు పాఠశాలను సందర్శించగా ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ విద్యార్థులకు ప్లేట్లు అవసరమని చెప్పగా వారు సమకూర్చి పాఠశాలకు వితరణ చేశారు.