పుష్కర కాలువ మరమ్మతు పనులకు రూ. 60 లక్షల నిధులు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్, యనమల దివ్య ఆదివారం మీడియాకు తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడికి యనమల దివ్య లేఖ రాశారు. ఎమ్మెల్యే దివ్య విజ్ఞప్తి మేరకు పుష్కర కాలువ మరమ్మతులు పనులకు రూ. 60 లక్షలు నిధులు మంజూరు చేశారు. తుని మండల పరిధిలోని రైతులు సాగునీటి కష్టాలు తీరుతాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు.