గవర కమ్యూనిటీని బిసి-డి నుంచి బిసి-ఏ మార్చుటకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లి తన వంతుగా కృషి చేస్తాను అని గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ళ సురేంద్ర అన్నారు. తునిలో శుక్రవారం గవర వన సమారాధనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విదేశీ విద్య అభ్యసించేవారు జనవరి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు. ఛైర్మన్, డైరెక్టర్లు సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, సత్యనారాయణ పాల్గొన్నారు.