హిందూ విద్యార్థులకు ఒక మంచి అవకాశాన్ని కంచి కామకోటి పీఠం అందిస్తోంది. ఈ పీఠం ఆధ్వర్యంలో నేక్ గుర్తింపు పొందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో రాయితీ ఫీజులతో చేరుకునే అవకాశం కల్పిస్తున్నారు. స్కాలర్ షిప్ లు కూడా అందించనున్నట్టు నిర్వాహకులు మంగళవారం తెలిపారు. విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ కోసం ఏప్రిల్ 23న తుని గవరపేట శివాలయంలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు.