తుని: తలుపులమ్మ లోవలో భక్తుడికి పోగొట్టుకున్న సెల్ ఫోన్ అందజేత

64చూసినవారు
తుని: తలుపులమ్మ లోవలో భక్తుడికి పోగొట్టుకున్న సెల్ ఫోన్ అందజేత
తుని పట్టణంలో తలుపులమ్మ లోవ దేవస్థానంలో భక్తుడు పడేసుకున్న సెల్ ఫోన్ ను తిరిగి భక్తులకు అందజేశామని సోమవారం రాత్రి దేవస్థానం సిబ్బంది తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన చందక శివ అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన సెల్ ఫోను దేవస్థానం పరిసర ప్రాంతాల్లో పడిపోయింది. దేవస్థానం గార్డెన్ సిబ్బంది సారిపల్లి రాజుకు దొరికింది. దేవస్థానం సిబ్బంది ఆ భక్తుడికి అందజేశారు.

సంబంధిత పోస్ట్