టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ పూర్తిచేసిన అభ్యర్థులకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస నిర్వాహకులు తెలిపారు. తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య చొరవతో ఏప్రిల్ 19న శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రాజేశ్ బుధవారం మీడియాకు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో వికాస ఆధ్వర్యంలో 630 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.