తుని పట్టణంలోని వీరవరపుపేటలో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల మీడియాకు తెలిపిన వివరాలు ప్రకారం. గారా కృష్ణవేణి నిర్వహిస్తున్న పాన్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న సామగ్రి కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.