తుని: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆరా తీసిన ఆర్డీవో

77చూసినవారు
తుని: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆరా తీసిన ఆర్డీవో
తుని మండలం చేపూరులో పోలవరం ఎడమ కాలువ పనులను పెద్దాపురం ఆర్డీవో రమణి మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కాలువ పనులు వేగంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగించాలని కాంట్రాక్టర్లు, సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. ఆమె వెంట తహశీల్దార్ ప్రసాద్, పోలవరం అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్