తుని: తలుపులమ్మ లోవ క్షేత్రంలో గంధ అమావాస్య జాతర ప్రారంభం

50చూసినవారు
తుని మండలం లోవకొత్తూరు శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య క్షేత్రంలో గంధ అమావాస్య జాతర మహోత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో విశ్వనాథరాజు ఆధ్వర్యంలో అమ్మవారి పుట్టింటి గ్రామమైన లోవకొత్తూరు నుంచి గరగలను తీసుకువెళ్లి కొండపై అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై గరగల సంబరాలు ఘనంగా నిర్వహించారు. నేటి నుంచి 27వ తేదీ వరకు అమ్మవారి గంధ అమావాస్య జాతర ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్