ఆక్వా, హార్టికల్చర్, ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ రంగాలను సహకార పద్ధతిలో అభివృద్ధి చేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు సూచించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి తునిని మార్గదర్శకంగా తీర్చిదిద్దాలని తేటగుంట టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పేర్కొన్నారు.