కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో తాండ్రపాపారాయుడు విగ్రహాన్ని గ్రామ పెద్దలు గురువారం ప్రారంభించారు. ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తూ సేవే మార్గంగా ముందుకు వెళ్లిన మహోన్నత వ్యక్తి తాండ్ర పాపారాయుడు అని గ్రామ పెద్దలు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాపారాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.