రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ నేత తోట నవీన్ శుక్రవారం తేటగుంట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడును మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరుగుతున్న తీరును నేతలు యనమలకు వివరించారు.