తుని: షార్ట్ సర్క్యూట్ తో తాటాకు ఇల్లు దగ్ధం

67చూసినవారు
తుని: షార్ట్ సర్క్యూట్ తో తాటాకు ఇల్లు దగ్ధం
తుని మండలంలో ఎన్. సూరవరం గ్రామంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. వడ్లమూరి అప్పలనరస తాటాకిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ మీటర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి మొత్తం దగ్ధమైంది. టీడీపీ సీనియర్ నాయకులు చింతమనీడి అబ్బాయి ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సహాయం, 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్