తుని పట్టణంలోని బాలుడు కిడ్నాప్ కదా సుఖంతమైంది. సోమవారం బాలుడు తల్లిదండ్రులు చెంతకు చేరాడు. సోమవారం కిడ్నాప్ అయినా బాలుడు తండ్రికి ఫోన్ చేసి డి. పోలవరంలో బాబును వదిలేస్తున్నానని సమాచారం అందించాడు. అక్కడి నుంచి బాలుడిని వెంటనే షాపులో పనిచేసే ఇద్దరు వ్యక్తులతో తునికి ఆటోలో తీసుకువచ్చారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియవలసి ఉందని పోలీసులు తెలిపారు.