తుని: రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడి మృతి

84చూసినవారు
తుని: రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడి మృతి
తుని రైల్వేస్టేషన్ సమీపంలో పెద్ద రైల్వేగేటు వద్ద విశాఖ వైపునకు వెళ్లే రైలు ఢీకొని శనివారం గుర్తు తెలియని వృద్ధుడు (65) మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై జి. శ్రీనివాసరావు తెలిపారు. ఎరుపు, తెలుపు చారల చొక్కా, సిమెంటు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, మరింత సమాచారం కోసం జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్